నన్ను దేవుడితో పోల్చవద్దు: సౌదీరాజు సాల్మన్

SMTV Desk 2017-07-03 19:17:45  saudi arabia, manaama, salaman bin

మనామా, జులై 03 : ప్రముఖ కాలమిస్ట్ అల్ ఇనేంజీని సస్పెండ్ చేయాలనీ సౌది రాజు సాల్మన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సాద్ తనదైన రీతిలో స్పందించారు. సౌది డైలీకి ఒక వ్యాసం రాసిన కాలమిస్ట్.., సౌది రాజుకి దేవుడి లక్షణాలు ఉన్నాయ్. రాజు దేవుడితో సమానం అంటూ అతిగా పొగిడారు. ఈ వ్యాసం చదివిన రాజు పై విదంగా స్పందించారు. కాలమిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక మనిషిని దేవుడితో పోల్చడం సరికాదని తప్పు చేసిన కాలమిస్ట్ ని వెంటనే తొలగించి, ఈ వార్తని ప్రసారం చేసిన అల్-జజీరా ఛానల్ పై కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా వార్త సంస్థలకు ఓ సూచన ఇచ్చారు. నేను దేవుడితో పోల్చడాన్ని, అతిగా పొగడడాన్ని సహించబోనని వార్త సంస్థలకు సూచన ఇచ్చారు. అయితే ప్రపంచ దేశాల్లోని నేతల్లో చాలామంది పొగడ్తలతో వార్తలు రాయించుకుంటారు.. కాని సౌది రాజు ఇందుకు భిన్నంగా వ్యవహరిచడం చర్చనీయాంశంగా మారింది.