పిల్లలు పుట్టాలంటే శృంగార భంగిమలు కూడా చాలా ముఖ్యం

SMTV Desk 2020-01-13 14:40:26  

పిల్లలు పుట్టేందుకు సాయపడే పొజిషన్స్ ఇవే..చాలా మంది మహిళలు వివాహం జరిగినప్పట్నుంచీ తల్లి కావాలని ఎదురుచూస్తారు. తల్లి కాబోతున్నారు అన్న మాట కోసం తహతహలాడుతుంటారు. కానీ, కొందరికీ అనేక కారణాల వల్ల త్వరగా పిల్లలు పుట్టరు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఇందులో ఒక్కోక్క సమస్యకి ఒక్కో పరిష్కారం ఉంటుంది. పిల్లలు పుట్టాలంటే శృంగార భంగిమలు కూడా చాలా ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు. కొన్ని భంగిమల్లో శృంగారం చేస్తే చాలావరకూ మెరుగైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

*** ​పిల్లలు పుట్టేందుకు సాయపడే భంగిమలు..
ఆ కార్యంలో అనేక భంగిమలు ఉంటాయి. వీటన్నింటికి గురించి నిపుణులకు తప్పా అందరికీ అంతగా తెలియవు. అయితే, ఇందులో ఒక్కో భంగిమకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ భంగిమ పిల్లలు పుట్టేందుకు సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే మిషనరీ భంగిమ.. సెక్స్ ఎక్స్‌పర్ట్స్ ఈ పొజిషన్ గురించి సంతానలేమి సమస్యలను ఇది కచ్చితంగా దూరం చేస్తుందని చెబుతున్నారు.

*** ​మిషనరీ భంగిమ గురించి..
ఈ భంగిమ గురించి చాలా మందికే తెలిసే ఉంటుంది.. ఇందులో స్త్రీ కిందవైపు ఉంటే.. పురుషుడు ఆమెపై ఉంటాడు. ఇలా శృంగారంలో పాల్గొనడం వల్ల పురుషుడు నుంచి విడుదలయ్యే వీర్యకణాలు.. నేరుగా గర్భం ముఖ ద్వారా లోపలికి వెళ్తాయి. దీని వల్ల త్వరగా గర్భం దాల్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పొజిషన్‌లో వీర్యకణాలు బయటకు లీక్ సమస్య కూడా ఉండదు.. ఈ పొజిషన్‌లో వీర్యకణాలు నేరుగా గర్భాశయంలోకి వెళ్తాయి. ఈ కారణంగా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే.. కణాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. వీర్యం సరిగ్గా యోని దాటి గర్భంలోకం ప్రవేశిస్తుంది. దీంతో.. అండంతో కలిసి సంయోగం చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య శాస్త్రాలు చెబుతున్నాయి.

*** ​డాగీ స్టైల్..
మరో ముఖ్యమైన పొజిషన్ గురించి చెప్పాలంటే.. డాగీ స్టైల్ అని చెప్పొచ్చు. ఈ పొజిషన్‌లో కూడా కలవడం ద్వారా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని పాటించడం కాస్తా కష్టమైనప్పటికీ.. ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

*** ​భంగిమలు ఎందుకు అంత ముఖ్యం..
శృంగారం అంటే ఏదో చేసేశాంలే అనుకున్నట్లు కాదు.. ఇందులోఎన్ని తెలుసుకున్నా తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా.. రతి క్రీడలో కొన్ని భంగిమలు ఉంటాయి. ఈ పొజిషన్స్ ద్వారా భావప్రాప్తి మొదలు.. అనేక లాభాలు ఉంటాయి. కొన్ని భంగిమలు శృంగారాన్ని ఆస్వాదించేలా చేస్తే.. మరికొన్ని మగవారి నుంచి విడుదలయ్యే వీర్యకణాలను సరిగ్గా మహిళల శరీర భాగాల్లోకి ప్రవేశించేలా చేయిస్తాయి. ఈ కారణంగా త్వరగా గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

*** ​ఈ పొజిషన్స్ ఎందుకు పనిచేస్తాయంటే..
మాములుగా శృంగారంలో కొన్ని భంగిమల్లో శృంగారం చేసేటప్పుడు.. ఆ సమయంలో మగవారి నుంచి విడుదలయ్యే కణాలు స్త్రీ శరీరంలోకి సరిగ్గా ప్రవేశించలేవు.. దీంతో గర్భం విఫలమయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే, ఈ భంగిమలతో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.. చిన్నపాటి తలగడను స్త్రీ నడుం కింద భాగంలో పెట్టాలి. ఇలా రతిలో పాల్గొంటే.. వీర్యకణాలు సరిగ్గా స్త్రీ శరీరంలోకి ప్రవేశించి త్వరగా గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల విఫలం అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.