నవాజ్‌ షరీఫ్‌ పై జీవితకాల నిషేధం

SMTV Desk 2018-04-13 16:04:22  Nawaz Sharif, former Prime Minister pakistan, pakistan supreme court, life time ban on nawaz sharif

ఇస్లామాబాద్‌, ఏప్రిల్ 13: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణలతో పదవి నుంచి వైదొలిగిన ఆయనపై జీవితకాలం అనర్హత వేటు విధిస్తూ పాక్‌ సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రక తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జిస్టస్‌ సాఖిబ్‌ నిసార్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బెంచ్‌ ఈ తీర్పును చెప్పింది. ఈ మేరకు పాక్‌ మీడియా వివరాలు వెల్లడించింది. ‘పాకిస్థాన్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21(1)(f) ప్రకారం.. నవాజ్‌ షరీఫ్‌పై జీవితకాలం అనర్హత వేటు విధిస్తున్నాం. దీంతో ఆయన ఎన్నటికీ పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు అర్హత లేదు. అంతేగాక.. ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు వీలులేదు’ అని సుప్రీంకోర్టు తెలిపింది.