బీజేపీ అణగదొక్కాలని చూస్తోంది : చంద్రబాబు

SMTV Desk 2018-03-19 15:01:57  chandrababu naidu, ap cm, Muslims, tdp, central govt.

అమరావతి, మార్చి 19 : బీజేపీ తనను అణగదొక్కాలని చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నేడు టీడీపీ మైనార్టీ వింగ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. "ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. నాలుగేళ్లు ఎదురుచూసినా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. దీంతో భాజాపా నుండి బయటకు వచ్చేశాం" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైసీపీ నాటకాలాడుతూ.. కుట్రలు చేస్తుందన్నారు. నాలుగేళ్లు బాగానే ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఇలా విమర్శలు చేయడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం కూడా అవినీతికే అండగా నిలుస్తోందని దుయ్యబట్టారు. అదేంటని ప్రశ్నిస్తే.? యుద్ధం చేస్తామంటో౦దని విమర్శించారు. "ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించడం సరి కాదని బీజేపీ నాయకత్వానికి నేను చెప్పాను. ఆ బిల్లును వ్యతిరేకించిన మొదటి వ్యక్తిని నేను" అని చంద్రబాబు తెలిపారు.