టీడీపీ ఎంపీలకు విప్ జారీ..!

SMTV Desk 2018-03-19 11:43:09  tdp party, mps, Parliament meetings, amaravathi.

అమరావతి, మార్చి 19 : కేంద్రంపై తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు లోక్‌సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమ ఎంపీలకు టీడీపీ పార్టీ విప్ జారీ చేసింది. తెదేపా జాతీయ స్థాయిలో అవిశ్వాస తీర్మానానికి వివిధ పార్టీల మద్దతు కూడగడుతోంది. కాని సభ సాఫీగా సాగితేనే చర్చకు అనుమతిస్తామని స్పీకర్ తెలపడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులు తప్పకుండ ఎంపీలందరూ ఉభయసభలకు హాజరు కావల్సిందేనని టీడీపీ పార్టీ తమ ఎంపీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉభయసభలో ఎంపీల౦తా విభజన అంశంపైన ఆందోళన కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి.