తానే స్వయంగా బరిలోకి..

SMTV Desk 2018-03-18 12:37:15  JANASENA, PAWAN KALYAN, AMARAVATHI TOUR, LAND ISSUE.

విజయవాడ, మార్చి 18 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అమరావతి పరిధిలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన గ్రామాల్లో ఒకటైన ఉద్దండరాయునిపాలెం రైతులను కలిసేందుకు బయలుదేరారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన మాకు ఇంకా పరిహారం అందించలేదని పలువురు రైతులు పవన్ వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన పవన్.. తానే స్వయంగా వచ్చి ఆ గ్రామంలో పర్యటిస్తానని, నష్ట పరిహారం విషయంపై చర్చిస్తానని మాటిచ్చారు. ఈ మేరకు నేడు ఉద్దండరాయుని పాలెంకు వెళ్లనున్నారు. నష్టపరిహారం అందని రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. గతంలోనూ పవన్ ఈ గ్రామంలో పర్యటించిన పర్యటించారు.