ఆర్థిక నేరస్తులు చంద్రబాబు, లోకేషే : రోజా

SMTV Desk 2018-03-16 18:02:03  YCP MLA, ROJA, TDP, BJP, JANASENA, PAWAN KALYAN.

తిరుపతి, మార్చి 16 : బీజేపీతో చేతులు కలిపామంటూ వస్తున్న వార్తలపై వైకాపా ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఒకవేళ బీజేపీ తో జత కలిస్తే కేంద్రంపైనే అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న, మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ మంచోడ౦టూ చెప్పుకుంటూ వస్తున్న టీడీపీ.. ఇప్పుడు ప్రశ్నించే సరికి చెడ్డవాడు అంటోంది. ప్రశ్నిస్తే చెడ్డ వ్యక్తి అయిపోతారా.? నిజంగా ఆర్ధిక నేరస్తులు.. చంద్రబాబు, లోకేష్ లే. జగన్ కాదు అంటూ ధ్వజమెత్తారు. బీజేపీతో వైకాపా చేతులు కలపడం ఏంటి.? అలా అయితే అవిశ్వాస తీర్మానం ఎందుకు ఇస్తాం. ఇలాంటి విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం.. అంటూ ప్రశ్నించారు.