పవన్ పార్టీ మిస్డ్ కాల్ పార్టీయా.? : సోమిరెడ్డి

SMTV Desk 2018-03-16 11:51:26  minister somireddy chandramohan reddy, janasena, pawan kalyan.

అమరావతి, మార్చి 16 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి సోమిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "జనసేన ఆవిర్భావ సభలో ప్రధాని పేరు ఎత్తకుండా పవన్ ప్రసంగించడం ఏంటి.? ఇవి దేనికి సంకేతాలు అనుకోవాలి.?" అంటూ ప్రశ్నించారు. వైకాపా జగన్ తరహాలోనే పవన్ జనసేన పార్టీ కూడా మిస్డ్ కాల్ పార్టీగా తయారైందన్నారు. "తెలంగాణాలో రిజర్వేషన్లపై ప్రశంసలు జల్లిన పవన్.. ఏపీలో రిజర్వేషన్లపై విమర్శలు చేయడం ఏంటి.? అసలు జనసేన ఆవిర్భావ సభను నిర్వహించింది ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి లోకేష్ ను తిట్టడానికేనా.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆవేశంలో జరిగిన కొన్ని సందర్భాలను ప్రస్తావిస్తూ.. టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేస్తున్నారంటూ విమర్శలు చేయడం తగదు. మోదీకి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పిన పవన్‌.. ఒక్కసారిగా పన్నీరు సెల్వంలా ఎలా మారిపోయారో అర్ధం కావడం లేద"ని వ్యాఖ్యానించారు.