బడ్జెట్ అంకెల గారడీ : ప్రకాశ్‌ కరత్

SMTV Desk 2018-02-12 12:35:57  WEST GODAVARI, CPM, PRAKASH KARATH, BUDGET,

పశ్చిమగోదావరి, ఫిబ్రవరి 12 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌ పై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారత్ మండిపడ్డారు. బడ్జెట్ లో ఆర్భాటాలు, గొప్పలు, అంకెల గారడీ తప్ప నిధుల్లేవని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర 25వ మహాసభలకు వచ్చిన ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల ప్రకారం కొత్త బడ్జెట్‌లో రైతులకు ఉత్పత్తి ఖర్చులపై 50 శాతాన్ని కలిపి కనీస మద్దతు ధరగా ఇస్తామని చెప్పారు. కానీ కేటాయించిన రూ.2వేల కోట్లు ఏ మాత్రం చాలవు. మద్దతుధర ఆమలుకావాలంటే కనీసం లక్ష కోట్ల రూపాయలు అవసరమని కరత్‌ అన్నారు. మరోవైపు బీమా పథకం ప్రైవేటు ఆస్పత్రులకు, బీమా సంస్థలకు లబ్ధి కలిగించేలా ఉందని ఆరోపించారు. బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక రాఫెల్‌ విమానాల కొనుగోళ్లు కుంభకోణానికి తావిస్తోందని అని ఆయన అన్నారు. "బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఇప్పుడు పోరాటం చేస్తున్న అధికార టీడీపీ ఈ నాలుగేళ్లు నిద్రపోయిందా. బీజేపీకి మిత్ర పక్షంగా ఉండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇంతా వరుకు ఎందుకు సాధించలేకపోయింది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం" అని కరత్ వ్యాఖ్యానించారు.