ముఖ్యమంత్రిని కలిసిన ఎంపీ గల్లా జయదేవ్‌..

SMTV Desk 2018-02-11 13:42:52  ap cm, chandrababu naidu, mp galla jayadev, rammonahar naidu, amaravathi

అమరావతి, ఫిబ్రవరి 11 : కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంటులో వినిపించి విజయం సాధించిన ఎంపీలు గల్లాజయదేవ్, రామ్మోహన్ నాయుడు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన నిరసన గళాన్ని పార్లమెంటులో సమర్ధవంతంగా వినిపించిన తీరుపై ఎంపీలు జయదేవ్, రామ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఎంపీలతో పాటు పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర, సీఎంఓ అధికారులు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులు ఈ భేటికి హాజరయ్యారు.