మహిళలకు మేలు చేసేందుకే "స్వర్ణభారత్" : వెంకయ్య

SMTV Desk 2018-02-04 15:04:15  SWARNA BHARATH TRUST, VENKAIAH NAIDU, HERO VENKATESH.

ఆత్కూరు, ఫిబ్రవరి 4 : మహిళల పట్ల వివక్ష తొలగినప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ రెండో వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఏర్పాటు చేసిన ఈ స్వర్ణభారత్ ట్రస్ట్.. ఆ తర్వాత విజయవాడ, హైదరాబాద్ లలో విస్తరించామన్నారు. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులకు మేలు చేసేందుకే ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి సంస్థలు ఏర్పడినప్పుడే ప్రజలకు మరింత మేలు జరగడమే కాకుండా "స్వర్ణభారతం" ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, శాసన సభాపతి కోడెల శివప్రసాద్ సహా సినీనటుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ.. జీవితంలో ఎదగాలనుకునే ఏ వ్యక్తికైనా శిక్షణ అవసరమన్నారు.