కిమ్‌ జాంగ్‌ ప్రేయసి రాకతో దక్షిణ కొరియాలో ఆందోళనలు..

SMTV Desk 2018-01-23 12:39:42  south koria, north koria, jim jang un, lover hyone, Olympics.

సియోల్, జనవరి 23 : దక్షిణ కొరియాలో జరగనున్న ఒలింపిక్స్‌లో భాగంగా ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ప్రేయసి హ్యోన్‌ సాంగ్‌వోల్‌ ద.కొరియాకు వెళ్లారు. ఈ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా ఒలింపియన్లు కూడా పాల్గొననున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆమె ద.కొరియా వెళ్ళినట్లు తెలుస్తోంది. హ్యోన్‌ అక్కడకు చేరుకోగానే మీడియా ఆమె ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తూ ఎక్కడకు వెళ్ళిన ఆమెనే ఫాలో అయ్యారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా హ్యోన్‌ రాకతో దక్షిణ కొరియాలో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. అక్కడి కార్యకర్తలు కిమ్‌ ఫొటోలను దహనం చేస్తూ హ్యోన్‌ ఇక్కడి నుండి వెళ్లిపోవాలంటూ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు.