కొత్త వరి వంగడాన్ని సృష్టించిన చైనా శాస్త్రవేత్తలు

SMTV Desk 2018-01-20 15:36:46  new rice budding, china, scientist, developed, kefugeng 9

బీజింగ్, జనవరి 20: చైనా శాస్త్రవేత్తలు కొత్త రకం వరి వంగడాన్ని అభివృద్ధిపరిచారు. చాలా రుచిగా వుండే, అధిక దిగుబడినిచ్చే ఈ వంగడాన్ని రెండు వేర్వేరు రకాల విత్తనాలను కలిపి రూపొందించారు. విదేశీ రకానికి చెందిన రెండు వంగడాల్లోని కీలకమైన జన్యువులను విశ్లేషించిన అనంతరం శాస్త్రవేత్తలు అధిక సామర్ధ్యం గల హైబ్రీడ్‌ జన్యువును సృష్టించారు. దాంతో కొత్తగా కెఫుగెంగ్‌ 9 అనే వంగడాన్ని అభివృద్దిపరిచారు. రుచికి రుచి, అధికంగా దిగుబడి అవసరాలను ఈ కొత్త వంగడం నెరవేరుస్తుందని భావిస్తున్నట్లు తూర్పు చైనాలోని హెఫై యూనివర్శిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన కెమిస్ట్రీ విభాగ శాస్త్రవేత్త లియూ బిన్‌మెయి పేర్కొన్నారు.