రష్యాలో మైనస్‌ 67 సెం. డిగ్రీలు!

SMTV Desk 2018-01-17 11:58:19  russia, low temperature, yakutima, minus 67

యకూటియా, జనవరి 17: రష్యా చలితో వణికిపోతుంది. వజ్రాలు విరివిగా లభ్యమయ్యే రష్యాలోని యకూటియా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కనివిని ఎరుగని స్థాయికి పడిపోయాయి. అక్కడ రికార్డు స్థాయిలో మైనస్‌ 67 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక్కడికి సమీపంలోని యకుట్సాలో మైనస్‌ 50 డిగ్రీలు నమోదు కావడంతో ప్రజల కనురెప్పలు సైతం మంచుతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితితో రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.