రాయలసీమలో నడిరోడ్డుపై దారుణ హత్య

SMTV Desk 2017-05-29 11:08:31  murder,middle road murder,karnool

ప్రొద్దుటూరు, మే 27 : రాయలసీమలో నడిరోడ్డుపై మరోమారు భయానక హత్య చోటు చేసుకుంది. గత నాలుగురోజుల క్రితం ఫ్యాక్షన్ హత్య అత్యంత జుగుప్సాకరమైన పద్దతిలో కొనసాగగా గురువారం మరో డెత్ రేస్ అందర్ని భయకంపితుల్ని చేసింది. పాత కక్షల నేపధ్యంలో జరిగిన హత్య సినిమా ఫక్కిలో భయకంపితుల్ని చేసింది. ప్రొద్దుటూరు కోర్టు సమీపంలో మారుతిరెడ్డిని ప్రత్యర్థులు కత్తులతో వెంటాడారు. అతను ప్రాణభయంతో పారిపోతున్నా వదిలిపెట్టకుండా వెంటాడి.. వేటాడి విచక్షణారహితంగా నరికి చంపారు. ఆ చుట్టు ప్రక్కల వందల మంది చూస్తు నిలబడిపోయారే గాని బాధితుడిని కాపాడేందుకు ఎవరు ముందుకు రాలేదు. పాత కేసుకు సంబంధించి ప్రొద్దుటురు కోర్టులో హజరయ్యేందుకు రాగా కాపుకాచిన నలుగురు ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడ్డారు.