బ్రిటన్ మంత్రిగా ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు..!

SMTV Desk 2018-01-10 15:22:59  britan minister, narayanamoorti, son in law, infosis

లండన్, జనవరి 10: బ్రిటన్ పాలనలో రెండు శతాబ్దాలు మగ్గిన భారతీయులకు ఆ దేశ మంత్రులుగా సేవచేసే అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఇద్దరు భారతీయ సంతతి ఎంపీలకు తన క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. ఆ ఇద్దరిలో ఒకరు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ కాగా మరొకరు సుయెల్ల ఫెర్నాండేజ్. థెరిసా మేకు చెందిన కన్జర్వేటివ్ ప్రభుత్వం తాజాగా తన మంత్రిమండలిని విస్తరించింది. ఎంపీ ఫెర్నాండేజ్ పూర్వీకులు గోవాకు చెందినవారు. అయితే భారతీయ సంతతి ఎంపీలు ఇద్దరూ బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేశారు. నారాయణమూర్తి అల్లుడు సునక్ బ్రిటన్ ప్రభుత్వంలో హౌజింగ్ శాఖ మంత్రిగా చేయ‌నున్నారు. ఈయన నార్త్ యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నుంచి 2015లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 37 ఏళ్ల రిషి సునక్.. ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. బెంగుళూరుకు చెందిన ఓ సిలికాన్ వ్యాలీ కంపెనీలో సునక్ పెట్టుబడులు ఉన్నాయి. బ్రిటన్ క్యాబినెట్‌లో స్థానం పొందిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులు దేశానికే గర్వకారణం.