సొంత నగరాన్ని ధ్వంసం చేసుకున్న ఉత్తర కొరియా!

SMTV Desk 2018-01-06 17:15:55  north korea, own town, explore, america security agency

న్యూయార్క్, జనవరి 06: ఐరాసలాంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నా వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ శాంతికి సవాలు విసురుతున్న ఉత్తర కొరియాకు చేదు అనుభవం ఎదురైంది. గత సంవత్సరం ఏప్రిల్ 28న ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేయగా అది విఫలమవడంతో తనసొంత నగరాన్నే ధ్వంసం చేసుకు౦ది. ప్యాంగ్ యంగ్ నుంచి హ్వసంగ్-12 అనే క్షిపణిని ప్రయోగించగా అందులోని ఇంజన్ విఫలం కావడంతో సమీపంలోని టోక్చోన్ నగరంపైకి దూసుకుపోయింది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, గూగుల్ మ్యాప్స్ ను పరిశీలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి.