కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాం: జగన్

SMTV Desk 2018-01-06 15:41:16  jagan, ycp, tdp, chittoor,

చిత్తూరు, జనవరి 6: పేద మైనార్టీ విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. పాదయాత్రలో భాగంలో చిత్తూరు జిల్లా పుంగనూర్ మండలం కల్లూరులో నిర్వహించిన మైనార్టీల సదస్సులో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..."ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అందర్నీ దగా చేశారని, ఎవరైనా ఎదురు తిరిగితే తోలు తీస్తా, తాట తీస్తా అని బెదిరించేవారని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే ముస్లింల కోసం సబ్ ప్లాన్ తీసుకొస్తామని, ఇమామ్ లకు రూ. 10 వేలు, మౌసమ్ లకు రూ. 5 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. దివంగత వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీలో మార్పులు చేస్తానని అన్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి రూ. 10 వేల పెన్షన్ అందిస్తామని తెలిపారు. చిన్న పిల్లల చదువు ఖర్చు కోసం రూ. 20 వేల రూపాయలు ఇస్తామని అన్నారు.