అగ్రరాజ్యం తో పెట్టుకుంటే అంతే..!

SMTV Desk 2018-01-05 11:22:28  America counter to pakisthan, donaldtrump, terrarist

వాషింగ్టన్‌, జనవరి 4 : అగ్రరాజ్యం అమెరికా.. ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం అవుతోందని, నిర్మూలనకు కనీస చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ కు సైనిక సహాయాన్ని నిలిపివేసి ఇప్పుడు భద్రతా సహకారాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరుకు సహాయ సహకారాలు అందిస్తుంటే పాక్.. అమెరికాను మోసం చేస్తుందంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర౦గా స్పందించారు. సైనిక సహాయ౦, భద్రత సహకార౦ రెండు కలిపి మొత్తంగా 1.15బిలియన్‌ డాలర్ల సహాయాన్ని అమెరికా ఆపేసింది. ఈ విషయంపై అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి హీతర్‌ మాట్లాడుతూ.. ఆఫ్గాన్‌ తాలిబన్లు, హక్కాని నెట్‌వర్క్‌ తదితర ఉగ్రసంస్థలపై తగిన చర్యలు తీసుకునేంత వరకు పాక్‌కు ఆర్థిక, భద్రత సహకారాలు నిలిపేస్తామని పేర్కొన్నారు.