పాలస్తీనాకు షాకిచ్చిన శ్వేతాధినేత..!

SMTV Desk 2018-01-03 16:09:49  palestine, donald trump, tweet, america,

వాషింగ్టన్‌, జనవరి 3 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా పాకిస్తాన్ కు 255 మిలియన్ల సైనిక సహకారాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం నుండి సాయం పొందుతూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాక్ సరైన చర్యలు తీసుకోవడం లేదనే కారణంతో అమెరికా నిధులను ఆపేసింది. తాజాగా ఇప్పుడు ట్రంప్ పాలస్తీనాకు కూడా సాయం నిలిపేస్తామని ట్విట్టర్ వేదికగా తెలిపి హెచ్చరించారు. ఈ ట్వీట్ లో ట్రంప్.."పాలస్తీనాకు సాయం చేయడం వల్ల అమెరికాకు ఎలాంటి ప్రశంస గానీ, గౌరవం గానీ లేదు. ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరుసలేంను గుర్తించే అంశంపై ఆ దేశం సుముఖుత వ్యక్త పరచడం లేదు. పాలస్తీనా కోసం ప్రతి సంవత్సరం వందల మిలియన్ల డాలర్లు ఇస్తున్నా౦. ఆయన ఆ దేశం మాకు సహకరించట్లేదు. ఇక మేము భవిష్యతులో ఎందుకు సహాయం చేయాలి” అని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల జెరూసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ నిర్ణయాన్ని పాలస్తీనా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.