కోడిపందేలపై హైకోర్టు ఆదేశం

SMTV Desk 2018-01-03 14:21:31  High Court Command, sankranth festival kodipandhelu

విజయవాడ, జనవరి 03 : కోడీపందేల విషయంలో అధికారులు ఉదాసీనతగా వ్యవహరిస్తే సహించబోమని హైకోర్టు హెచ్చరించింది. ఈ సంక్రాంతికి పందేలు జరుగకుండా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. తమ ఆదేశాలు అమలు చేయకుంటే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కోడీ పందేలు నిర్వహిస్తామన్న ప్రజాప్రతినిధుల తీరు పైన ఉన్నత న్యాయస్థానం మండిపడింది. ఈ పందేలపై 2016 డిసెంబర్‌ 26న ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ వేర్వేరుగా సమర్పించిన వివరాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అదనపు వివరాలు సమర్పించడం కోసం విచారణను ఈనెల 4కు వాయిదా వేసింది. వివరాలు సమర్పించడంలో విఫలమైతే వారిరువురు స్వయంగా కోర్టుకు హాజరుకావలని ధర్మాసనం తేల్చిచెప్పింది.