బ్రిటన్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం :1400 కార్లు ధ్వంసం

SMTV Desk 2018-01-02 18:19:30  Britan Liverpool fire hazard in a multi-storey parking building, 1400 cars were destroyed

బ్రిటన్, జనవరి 02 : బ్రిటన్ లోని లివర్‌పూల్‌ నగరంలో ఓ బహుళ అంతస్తుల పార్కింగ్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 1400 వందల కార్లు ధ్వంసం అయ్యాయి. ఓ పాత కారు ఇంజన్ లో చెలరేగిన మంటలు క్షణలోనే వ్యాపించాయి. 7 అంతస్తుల్లోని కార్లన్నింటికి మంటలు అంటుకోగా, ఆ ప్రాంతం అంతా దట్టంగా మంటలు వ్యాపించాయి. వందల కార్లు వరుసగా పేలటంతో అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. కాగా, ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. పార్కింగ్ లోపల ఉన్న మనుషుల సహా, కార్లలో చిక్కుకున్న రెండు కుక్కలను కాపాడారు. ఈ ప్రమాదంలో కార్లు తగలబడి ఇళ్లకు చేరుకోలేని వారికోసం అధికారులు సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు.