ఇరాన్ లో పెరుగుతున్న హింస కాండ..12 మంది మృతి

SMTV Desk 2018-01-02 16:16:27  iran, protest, tehran, social media banned,

టెహ్రాన్, జనవరి 2: ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో నిరసనల పర్వం తీవ్ర స్థాయికి చేరుకుంది. అక్కడి ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసిన నిరసన కారులు తమ వ్యతిరేకతను కొనసాగిస్తున్నారు. ఘర్షణల్లో ఇప్పటివరకూ 12 మంది మరణించనట్లు సమాచారం. మరో వైపు అక్కడి అధికారులు టెలిగ్రాం, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక అనుసంధాన వేదికలను నిషేధించారు. పెరుగుతున్న జీవన్ వ్యయం, అవినీతి, అంతే కాకుండా ఇరాన్ ప్రభుత్వం ప్రజా నిధులను ఉగ్రవాదులకు అందిస్తుందని ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ నిరసనను గత నాలుగు రోజులుగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.