ఏపీ రాజధానిపై రాష్ట్రపతి ప్రశంసలు.

SMTV Desk 2017-12-29 15:37:44  PRESIDENT, COMMENTS ON AMARAVATHI, TWITTER.

అమరావతి, డిసెంబర్ 29 : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. అమరావతి పర్యటన అనంతరం ఆయన తన అనుభవాలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. రాజధానిలోని ప్రభుత్వ సాంకేతిక కేంద్రం ఆసియాలోనే పెద్దదని విన్నట్లు పేర్కొన్నారు. అనేక సర్వీసులను ఆన్‌లైన్‌ ద్వారా అంది౦చడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంటర్‌నెట్‌తో అనుసంధానం తప్పనిసరి కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భవిష్యత్‌ను అర్థం చేసుకుని వ్యవహరిస్తోందని ప్రశంసించారు. అమరావతి నిర్మాణాలపై ఆయన స్పందిస్తూ.. "అమరావతి నిర్మాణం మొత్తం పూర్తయితే దేశంలోనే అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు కలిగిన నగరం అవుతుంది. ప్రజలంతా ముఖ్యమంత్రి చంద్రబాబులో అత్యుత్తమ అభివృద్ధి సాధించడానికి పడే తపననే చూస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.