నేడు ఏపీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి శంకుస్థాపన సీఎం...

SMTV Desk 2017-12-28 12:24:02  ap cm chandrababu naidu Forensic Science Laboratory

అమరావతి, డిసెంబర్ 28 : నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుళ్లూరులో ఏపీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...రానున్న రోజుల్లో నేరాలు జరగడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. అందుకే నేరాల ఆధారాలకు సంబంధించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సమర్థంగా పనిచేసి తప్పు చేసిన వారు తప్పించుకోకుండా చేయాలని సూచించారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు ఈ ఫోరెన్సిక్‌ లో కలిగి ఉండాలన్నారు. అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే వూపందుకున్నాయని చంద్రబాబు తెలిపారు. అనంతరం, డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ... రూ.400 కోట్ల వ్యయంతో ఈ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, ఇతర పోలీసులు ఉన్నతాధికారులు తదితరులు హజరయ్యారు.