వాయిదా పడిన ఏపీ టెట్...

SMTV Desk 2017-12-27 20:58:26  AP TET, POST PONED, AP HUMAN RESOURCES MINISTER, GANTA SRINIVASA RAO, AMARAVATHI

అమరావతి, డిసెంబర్ 27 : జనవరి 17 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో జరగాల్సిన ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వాయిదా పడింది. సమయం తక్కువగా ఉందన్న విద్యార్థుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. మళ్లీ ఈ పరీక్షను ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు దీన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. కొత్త షెడ్యూల్‌ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ, హాల్ టికెట్ల జారీ తేదీల్లో మార్పులు ఉంటాయని తెలిపారు. అంతే కాకుండా ఉపాధ్యాయ అర్హత పరీక్ష ర‌ద్దు చేస్తారంటూ వస్తోన్న విషయాలను అభ్యర్థులెవరూ నమ్మొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.