సెయింట్‌పాల్‌ కేథడ్రల్‌ చర్చిలో ఏపీ సీఎం

SMTV Desk 2017-12-25 15:16:36  St. Pauls Cathedral Church, ap cm chandrababu naidu

విజయవాడ, డిసెంబర్ 25 : దేవుడే మానవ రూపంలో వచ్చి, వివేకం అందించిన ప్రభువు యేసుక్రీస్తు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. విజయవాడ పడమటలోని సెయింట్‌పాల్‌ కేథడ్రల్‌ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలుపుతూ, మాట్లాడారు. రాష్ట్రంలో పేదరికాన్ని పారదోలేందుకు కట్టుబడి ఉన్నామని ఆ దిశగా నడిపించాలని ప్రభువును ప్రాద్ధించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏసుక్రీస్తు ఆశీర్వాదం అందజేయాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.