అమెరికా అధ్యక్షుడికి రష్యా సారధి కృతజ్ఞతలు...

SMTV Desk 2017-12-18 12:55:20   Vladimir Putin, Donald Trump, St. Petersburg,

రష్యా, డిసెంబర్ 18: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన సహాయానికి రష్యా సారధి వ్లాదిమిర్‌ పుతిన్‌ స్వయంగా ఫోన్‌చేసి మరీ కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ నెల 16న సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌పై దాడికి తీవ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేయడంలో సీఐఏ అందచేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు. సీఐఏ సమాచారం మేరకు రష్యాకు చెందిన ఎఫ్‌ఎస్‌బీ భద్రతా సర్వీసు అప్రమత్తమై, ఆ తీవ్రవాద ముఠాకు చెందిన ఏడుగురు సభ్యులను రష్యా అరెస్టు చేసింది.