చరిత్ర సృష్టించిన మహా మేధావి: చలమేశ్వర్‌

SMTV Desk 2017-12-17 15:44:15  Justice Jasti Chalameshwar, akkineni 4th International award,

ఏలూరు, డిసెంబర్ 17: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం నిర్వహించిన అక్కినేని 4వ అంతర్జాతీయ పురస్కారాల సభకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... " తెలుగు రాజధానులు మారుతూ వచ్చినప్పటికీ తెలుగువారంతా కలిసిమెలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఆనాడు హైదరాబాద్‌లో తొలిసారిగా స్టూడియోను నిర్మించి అక్కినేని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో చరిత్ర సృష్టించిన మహా మేధావి" అని కొనియాడారు. ఈ సభలో కళాతపస్వి కె.విశ్వనాథ్‌, సినీ రచయిత గొల్లపూడి మారుతిరావు, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు తదితరులను సన్మానించారు.