త్వరలో పర్యాటకంగా విశాఖ అభివృద్ధి :సీఎం చంద్రబాబు

SMTV Desk 2017-12-16 16:59:56  ap cm chandrababu naidu, vishakhapatnam, developement

విశాఖపట్నం, డిసెంబర్ 16 : విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నేటి నుంచి విశాఖలో హెలీ టూరిజానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ...విశాఖను గోవా కంటే ఇంకా సుందరంగా సాగర తీరాన్ని తీర్చి దిద్దుతామని, ఆయన తెలిపారు. అంతేకాకుండా పర్యాటకంగా విశాఖ అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. పర్యాటక అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా విశాఖను అభివృద్ధి చేస్తామని, రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, ప్రస్తుతం మంత్రి నారా లోకేశ్‌ విశాఖలో గూగుల్‌ ఎక్స్‌ కంపెనీ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.