పోలవరం ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర సీపీఐ కార్యదర్శి

SMTV Desk 2017-12-16 16:41:25  ap state CPI Secretary K. Ramakrishna, Polavaram project

అమరావతి, డిసెంబర్ 16 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును నేడు రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కె. రామకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే మిగతా వామపక్ష పార్టీలతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. 2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు రూ.32,000 కోట్లు ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టకేలకు పూర్తిచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టును పరిశీలించడానికి ఆయనతో పాటు పార్టీ నేతలు కూడా వచ్చారు.