ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రికి చేదు అనుభవం!

SMTV Desk 2017-12-16 12:38:45  minister, kamineni, buttayagudem, youth, skirmish

బుట్టాయగూడెం, డిసెంబర్ 16: పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయగూడెం ప్రభుత్వాసుపత్రి నూతన భవన ప్రారంభోత్సవానికి హాజరైన ఎపి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. భవనం ప్రారంభోత్సవం సందర్భంగా స్థల దాతలు కరాటం చంద్రయ్య, రంగనాయకమ్మల పేర్లు శిలాఫలకంపై పెట్టకపోవడాన్ని నిరసనగా సర్పంచ్‌ కంగాల పోసిరత్నం ఆధ్వర్యంలో కొందరు యువకులు భవనం ప్రారంభోత్సవాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి, యువకుల మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. స్థలదాత పేర్లు పెట్టాలని అప్పటివరకూ ప్రారంభోత్సవం జరగనివ్వమంటూ వారు పట్టుపట్టారు. అయితే కొన్ని నిబంధనలు ఉంటాయని, ఎవరికివారు పేర్లు రాసుకోకూడదని మంత్రి చెప్పారు. పరిస్థితి తీవ్రతరం దాల్చడంతో బీజేపీ నేత కరాటం రెడ్డినాయుడు యువకులకు సర్ధి చెప్పడంతో చివరకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు.