నేడు ఏపీలో మంత్రి వర్గ సమావేశం

SMTV Desk 2017-12-16 11:10:49  ap Ministerial Meeting, amaravathi

అమరావతి, డిసెంబర్ 16 : నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సదస్సు మధ్యాహ్నన సమయంలో జరగనుంది. ఈ నేపథ్యంలో 2014 పోలీస్ యాక్ట్ సవరిస్తూ చేసిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకునేలా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే డీజీపీని రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేగాక ఏపీఐఐసీకి పలు జిల్లాల్లో భూకేటాయింపులు, రూ.4,234 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం ప్రతిపాదనపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే అసెంబ్లీ డిజైన్లకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ మేరకు పలు అంశాలపై చర్చించనున్నారు.