ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రాయబార కార్యాలయం

SMTV Desk 2017-12-15 10:29:02  landan, Thames River, American Embassy, Cairn Timberlake

లండన్, డిసెంబర్ 15 : స్ఫటికాకార ఘనచతురస్రాలను పోలిన నిర్మాణాలతో ఉన్న ఇంద్రభవనాన్ని లండన్ లో అమెరికా రాయబార కార్యాలయ భవంతిగా నిర్మించింది. లండన్‌లోని థేమ్స్‌ నదికి సమీపాన రూ.6440 కోట్లతో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ భవంతిని ఫిలడెల్ఫియాకు చెందిన కైరన్‌ టింబర్‌లేక్‌ డిజైన్‌ చేశారు. 518 వేల చదరపు అడుగులు, 12 అంతస్థులున్న ఈ భవనంలో 800 సిబ్బంది విధులు నిర్వహిస్తారు. వ్యర్థజలాలను శుద్ధి చేసి పునర్వినియోగం చేయడం, భవనానికి కావాల్సిన విద్యుత్తు కంటే అధిక సౌరవిద్యుత్తు ఉత్పత్తిచేయడం, అనేక రకాల మొక్కలతో 12 ఉద్యానవనాలు, అమెరికా రాజ్యాంగంలోని స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలను స్ఫటికాలపై చెక్కడంవంటి ప్రత్యేకతలు ఈ భవనంలో ఉన్నాయి. నూతన ఏడాది, జనవరి 16న దీన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు సమాచారం.