అతిథి గృహాలను ప్రారంభించిన హోంమంత్రి చినరాజప్ప

SMTV Desk 2017-12-13 15:00:58  police homes opening, amaravathi, Home Minister chinnarajappa

అమరావతి, డిసెంబర్ 13 : మంగళగిరి ఆరో ఏపీఎస్పీ బెటాలియన్ లో నూతన భవనాలను హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు ప్రారంభించారు. పోలీసుల వసతి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. విహారి పేరిట అతిథి గృహాలు, వనభోజన శాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రసార మాధ్యమాల్లో వచ్చే నేరవార్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కొన్నిచోట్ల భూ సెటిల్‌మెంట్లలో పోలీసులు పాల్గొంటున్నారని, ఇప్పటి నుండైనా వాటికి దూరంగా ఉండాలన్నారు. పోలీసులు ఎప్పుడూ పేదల పక్షమే ఉండాలని.. అవినీతిని పూర్తిగా నిర్మూలించేలా ఎస్పీలు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణా, మాఫియాపై కఠినంగా వ్యవహరించాలని చినరాజప్ప పోలీసులు, అధికారులకు వెల్లడించారు.