విశాఖలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ యువజన విభాగం ధర్నా...

SMTV Desk 2017-12-13 12:10:59  agitation, ycp youth section, vishakhapatnam, special status

విశాఖపట్టణం, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని అయిన ‘ప్రత్యేక హోదా’ కోసం ప్రతిపక్ష వైకాపా తొలి నుంచి అనేక ఉద్యమాలు చేపడుతుంది. తాజాగా ఆ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నేడు విశాఖలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి చెప్పి ఓట్లు దండుకున్న బీజేపీ, టీడీపీలు ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ప్రజలను దారుణంగా మోసం చేశాయని వారు విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే టీడీపీ మంత్రులు ఎందుకు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నారని, రాజీనామా చేసి ప్రజల పక్షాన కేంద్రంపై పోరాడాలని వారు సూచించారు. చంద్రబాబుపై ఉన్న ఓటుకు నోటు కేసు నుంచి బయట పడడానికి ప్రత్యేక హోదాని కేంద్రానికి తాకట్టు పెట్టారని వారు దుయ్యబట్టారు.