ఈ తేదిల్లో దివ్యదర్శనం టోకెన్లు రద్దు

SMTV Desk 2017-12-12 17:53:01  thirumala, TTDJ CEO Srinivasa Raju

తిరుమల, డిసెంబర్ 12 : ఈ నెల 28, 29, 30, 31, జనవరి 1 తేదీల్లో దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు అన్నారు. ఈ నెల 29న వైకుంఠ ఏకాదశి, 30న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు ఉన్నందున, అలాగే నూతన సంవత్సరం రానుండటంతో, భక్తులందరికీ సర్వదర్శనం ద్వారానే శ్రీవారి దర్శనంను కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు భక్తుల రద్దీకి తగ్గట్టుగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి క్యూలైన్లలోకి భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు. ప్రొటోకాల్ వ్యక్తులకు మాత్రమే వైకుంఠ ఏకాదశి పాసులు జారీ చేయడం జరుగుతుందన్నారు. దర్శనం ఉదయం 5.30 గంటల నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. మొదటి వైకుంఠ ఏకాదశి పాసులు కలిగిన వారిని దర్శనానికి మొదటగా అనుమతిస్తామన్నారు. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి స్వామివారి సర్వదర్శనం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.