ఈ నెల 27న అమరావతికి రాష్ట్రపతి రాక

SMTV Desk 2017-12-12 14:51:22  President Ramnath Kovind, amaravathi, cm chandrababu naidu

అమరావతి, డిసెంబర్ 12 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ నెల 27వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రానున్నారు. నేడు ఆయా శాఖాధిపతులతో భేటీ నిర్వహించిన సీఎం చంద్రబాబు, 7న ఫైబర్ గ్రిడ్‌ను ప్రారంభించేందుకు రాష్ట్రపతి వస్తున్నారని నేతలకు వెల్లడించారు. కాగా, జనవరి 2వ తేదీ నుంచి జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జరగనుందని, అధికారులందరూ సిద్ధంగా ఉండాలంటూ ఆయన సూచించారు.