పోలవరం ప్రాజెక్టు పై త్రిసభ్య కమిటీ భేటీ

SMTV Desk 2017-12-10 16:55:14  polavaram project, vijayawada, Triumph Committee meeting

విజయవాడ, డిసెంబర్ 10 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలవరం ప్రాజెక్టు పనులపై విజయవాడలో ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు సారథ్యంలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక సమస్యలు, వాస్తవ ధరల్లో వ్యత్యాసాలు, టెండర్ల జారీ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణంపై ఎన్‌హెచ్‌పీసీ సాంకేతిక కమిటీ నివేదిక ఇచ్చే అంశంపై కూడా చర్చలు జరపనున్నారు. ఈ నిర్మాణంలో ఆర్థిక సమస్యలు, కాంట్రాక్టర్‌ విన్నపాలతో పాటు పెరిగిన అంచనాలు, అదనపు భారం సమస్యలపై భేటీ జరిగింది. దీనిపై ఎన్‌హెచ్‌పీసీ కమిటీ మూడు రోజుల్లో నివేదికను కేంద్ర జలవనరులశాఖకు ఇవ్వనుంది. అలాగే, నూతన టెండర్ల ప్రక్రియకు ప్రత్యామ్నాయాలను సూచించనున్నారు.