కంటి గాయానికి ఉపశమనం ఇచ్చే హైడ్రోజెల్‌

SMTV Desk 2017-12-09 14:54:40  eye, Hydrogel, Researchers at the Southern California University

లాస్‌ఏంజెల్స్‌, డిసెంబరు 09: మానవ శరీర భాగాల్లో కంటి భాగం అతి సున్నితమైనది. మరి అలాంటి కంటికి ఎన్నో జాగ్రత్తలు చాలా అవసరం. సైనికులు యుద్ధం చేసేటప్పడు సాధారణంగా కళ్లకు గాయాలవుతుంటాయి. ఈ మేరకు కంటి గాయాలకు తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు సదర్న్‌ కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు ఓ జెల్‌ను అభివృద్ధి చేశారు. సాధారణంగా ద్రవ రూపంలో ఉండే ఈ జెల్‌ వేడి చేస్తే ఘన రూపంలోకి మారుతుందని పరిశోధకులు తెలిపారు. అంటే.. ద్రవ రూపంలో ఉండే ఈ హైడ్రోజెల్‌ను కంటిలో వేసిన కాసేపటికి శరీరంలోని ఉష్ణోగ్రత వల్ల ఘన పదార్థంగా మారుతుందని అన్నారు. కంటి గాయం తీవ్రమై శస్తచికిత్స చేయాల్సిన అవసరం వస్తే ఈ జెల్‌ను తొలగించవచ్చన్నారు. కంటికి గాయలైనప్పుడు ఈ జెల్‌ను ఉపయోగిస్తే గాయం ఎక్కువకాకుండా చేయవచ్చని పరిశోధకులు వెల్లడించారు.