విశాఖ వాక్‌థాన్‌లో వెంకయ్యనాయుడు

SMTV Desk 2017-12-09 12:53:13  Indian Vice-President Venkiah Naidu, Vakthan, vishakhapatnam

విశాఖపట్నం, డిసెంబర్ 09 : నేడు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ వార్షిక సమ్మేళనంలో ఉదయం రామకృష్ణ బీచ్‌రోడ్డులో జరిగిన వాక్‌థాన్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తాను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకోవడం వల్లే ఉన్నత స్థానానికి చేరానని అన్నారు. రామకృష్ణ బీచ్‌లోని కాళీమాత ఆలయం వద్ద నుంచి పార్క్‌ హోటల్‌ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర ఆచార్యులు, పరిశోధకులతో కలిసి వెంకయ్యనాయుడు కూడా నడిచారు. కాగా, ఏయూ పూర్వ విద్యార్థులు భారీ ఎత్తులో తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.