ప్రారంభమైన జగన్‌ 28వ రోజు పాదయాత్ర...

SMTV Desk 2017-12-06 13:32:01  praja sankalpa yatra, jagan, ananthapuram, ysrcp

అనంతపురం, డిసెంబర్ 06: కర్నూలు జిల్లాలో పాదయాత్ర ముగించుకొని అనంతపురం జిల్లా చేరుకున్న ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 28వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్‌ తన 28వ రోజు పాదయాత్రను కొట్టాలపల్లి నుంచి ప్రారంభించారు. అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జగన్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జీవితం ఆదర్శనీయమని, ఆయన చూపిన బాటలో అందరూ నడవాలని ఆయన కోరారు. పాదయాత్ర కొట్టాలపల్లి సెంటర్‌, నాగాలపురం క్రాస్‌, గంజ్‌కుంటపల్లి, చిట్టూరుల మీదుగా తరిమెల వరకు కొనసాగనుంది. ప్రస్తుతం జగన్ పాదయాత్రలో భోజన విరామం తీసుకున్నారు.