ఇది కేవలం ప్రచారం :ఎంపీ శివప్రసాద్

SMTV Desk 2017-12-04 16:59:31  AP CM chandrababu naidu, chitturu MP Shivaprasad

చిత్తూరు, డిసెంబర్ 04 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఆరో తరగతి నుంచి 11వ తరగతి వరకు కలిసి చదువుకున్నామని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తెలిపారు. గతంలో పార్టీలో ఆనందంగా లేనని దీంతో పార్టీ మారుతున్నానని, వస్తున్న వార్తలన్నీ తానంటే ఇష్టపడని వారు చేసే ప్రచారమని చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ...చంద్రబాబునాయుడు తనకు సొంత అన్నలాంటివాడని అన్నారు. తమ మధ్య గ్యాప్ అన్న ప్రశ్నే లేదన్నారు. తాను అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వకపోవడం అన్నది ఇంతవరకు జరగలేదని, అయితే ఒకసారి మూడు గంటలు ఆలస్యమైందని ఆయన చెప్పారు. తాను ఫోన్ చేశానని చెబితే అటునుంచి అరగంటలోపు ఫోన్ వస్తుందన్నారు. అలాంటి తమ మధ్య గ్యాప్ ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం తాను చేసిన మంచి పనులతో వస్తున్న పేరును చూసి, ఆందోళన చెందినవారు చేస్తున్న ప్రచారమని ఆయన స్పష్టం చేశారు.