జగన్ కు రాజీనామా లేఖ రాసిన మాజీ చైర్మన్‌ ఎం.సుబ్రమణ్యం

SMTV Desk 2017-12-04 14:29:51  Chittoor JDP former chairman M. Subramanyam Reddy resigned, congress, jagan, chittoor

కుప్పం, డిసెంబరు 04 : కాంగ్రెస్ అధినేత జగన్ కు చిత్తూరు జెడ్పీ మాజీ చైర్మన్‌ ఎం.సుబ్రమణ్యం రెడ్డి రాజీనామా లేఖ రాశారు. ఈ నెల 3న తన సొంత నియోజకవర్గంలో ఆయన అనుచరులతో సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తమకు ఎదురవుతున్న అవమానాలు భరించలేక విధిలేని పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సుబ్రమణ్యంరెడ్డి వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హఠత్తుగా మరణించడంతో ఆయన కుమారుడైన జగన్‌కు అండగా నిలబడాలని భావించి, తన పదవిని సైతం త్యాగం చేసి మరీ వైసీపీలో చేరానని ఆయన చెప్పారు. 2014 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తానని చెప్పి, చివరకు బీసీ వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టినా పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేశానన్నారు. గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేస్తున్న ఆయన, తనకు కనీసం ఆహ్వానం కూడా లేకుండా కుప్పం నియోజకవర్గంలో పర్యటించడం బాధ కలిగించిందన్నారు.