కీయా అనుబంధ సంస్థతో సమావేశమైన సీఎం చంద్రబాబు

SMTV Desk 2017-12-04 12:29:13  AP CM Chandrababu tour, dakshinacouria

అమరావతి, డిసెంబర్ 04 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే తీసుకురావడం లక్ష్యంగా దక్షిణకొరియా పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి రోజు కీయ అనుబంధ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల్ని వారికి వివరించారు. ఏపీలో సంస్థలు నెలకొల్పేందుకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచంలోనే మెటుగా నిర్మిస్తున్న అమరావతిలో పెట్టుబడులకు తరలిరావాలని ఇందుకు ప్రభుత్వం తరుపున పూర్తిగా సహకరిస్తామని సీఎం వెల్లడించారు. అంతేకాకుండా కియా మోటార్స్ సంస్థను ఏపీకి ఆయన ఆహ్వానించారు. రాష్ట్రానికి మీరు అద్భుతమైన టౌన్ షిప్ నిర్మించండి. మీకు కావాల్సిన భూమి, నీటితో పాటు అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామని, అలాగే ఆంధ్రప్రదేశ్ మీ రెండో ఇంటిగా మార్చుకోండి, అని దక్షిణకొరియాతో ఆయన పేర్కొన్నారు.