నార్త్‌కరోలినా, డిసెంబర్ 03 : అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఆకలితో ఉత్తర కరోలినా రాష్ట్రంలోని వాఫెల్ హౌస్ అనే రెస్టారెంట్‌కి వెళ్లగా, సిబ్బంది నిద్ర పోవడం చూసి తానే స్వయంపాకం చేసుకుని మరి తిని వెళ్లాడు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. అయితే, ఆ సమయంలో అలెక్స్ తాగున్నాడు. తనకు తానే రెస్టారెంట్‌లోని కిచెన్‌లోకి వెళ్లి నచ్చిన ఆహారం వండుకున్నాడు. అంతేకాదు.. నిజాయితీగా అక్కడి రిసెప్షన్‌లో డబ్బులు పెట్టేసి వెళ్లిపోయాడు. కాగా, అలెక్స్ చేసిన పనికి రెస్టారెంట్ యాజమాన్యం కోపగించుకున్నా, అతను వండుకున్న విధానం నచ్చి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. తాగి ఉన్న మైకంలో చేసిన పని, అతనికి బాగా కలిసొచ్చింది. మరి ఈ ఉద్యోగంపై ఇంకా అతనికి సమాచారం అందిందో లేదో తెలియాల్సి ఉంది.