అసెంబ్లీ మందిరంలో ఎమ్మెల్యేల కునుకు... వైరల్

SMTV Desk 2017-12-03 12:44:49  AP assembly, CM chandrababu, MLA S Sleeps, viral

అమరావతి, డిసెంబర్ 03 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ చర్చల్లో భాగంగా శనివారం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే, పలువురు ఎమ్మెల్యేలు కునుకు తీశారు. అయితే, ఈ దృశ్యాన్ని గమనించిన నెటిజన్లు ఫొటోను షేర్ చేసుకుంటూ చంద్రబాబు వెనకే ఉండి కునుకు తీస్తున్న ఎమ్మెల్యేల దృశ్యమిది. అంటూ తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు కునుకు తీస్తున్న ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సమస్యలపై మంత్రులను నిలదీస్తున్నారని ప్రభుత్వం ఎంతగా చెప్పుకున్నా, నెటిజన్లు ఎక్కడో ఒకచోట తప్పును వెతుకుతూనే ఉన్నారు.