ఉత్తరకొరియాకు ధీటుగా క్షిపణి ప్రయోగం..!

SMTV Desk 2017-11-30 11:46:25  South Korea missile experiment, north koriya, kim jang un, ICBM Missile experiment.

సియోల్‌, నవంబర్ 30 : ఉత్తరకొరియా ఊహించని విధంగా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ఐసీబీఎం)ను ప్రయోగించి అందరికి షాక్ ఇచ్చింది. అయితే ఉత్తరకొరియాకు దీటుగా సమాధానం చెప్పడానికి దక్షిణ కొరియా సైతం క్షిపణి ప్రయోగం చేసింది. ఉ.కొరియా ఈ క్షిపణిని ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే దక్షిణ కొరియా కూడా ప్రయోగించడం గమనార్హం. ఈ క్షిపణిని రాజధాని సియోల్‌ మీదుగా ప్రయోగించినట్లు ద.కొరియా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఉ.కొరియా వైఖరి చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలున్నాయని ప్రపంచ దేశాలు బెంబేలెత్తుతున్నాయి. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు, జపాన్‌ ప్రధాని షింజో అబే, ద.కొరియా అధ్యక్షుడు మూన్‌ జేఇన్‌లతో ఫోన్ లలో విడివిడిగా చర్చలు జరిపారు.