కీలక ప్రకటన చేయనున్న ఉత్తరకొరియా.. అసలేం జరిగింది..!

SMTV Desk 2017-11-29 17:56:57  north koriya sensational comments, missile experiment, kim jang un.

ఉత్తరకొరియా, నవంబర్ 29 : ఊహించని విధంగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించి యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఉత్తరకొరియా మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. క్షిపణి పరీక్ష విజయవంతమైన నేపథ్యంలో మరో కీలక ప్రకటన చేయనున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకటన ఏంటనేది మాత్రం తెలియరాలేదు. కిమ్ జాంగ్ ఏ క్షణంలో ఎలాంటి వార్త వినిపిస్తాడో అని అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయాన్ని దక్షిణకొరియా మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇప్పటికే కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తరకొరియాకు, అగ్రరాజ్యం అమెరికాకు మాటలతోనే యుద్ధ౦ జరుగుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా కిమ్‌ జాంగ్ తాజా ప్రకటనతో పరిస్థితులు తీవ్రంగా మారే పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.