సైన్యం వాడే 48 యాప్‌ల పై చైనా కన్ను

SMTV Desk 2017-11-29 16:34:38  Indian soldiers, china, Intelligence categories

బీజింగ్, నవంబర్ 29 ‌: డోక్లామ్‌ విషయంలో చైనా, భారత్‌కు మధ్య ఇటీవల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత సైనికులు వాడుతున్న సెల్‌ఫోన్లలో 48 యాప్‌లపై చైనా కన్నేసిందని వాటిని వెంటనే తొలగించాలని తాజాగా ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం ప్రకారం.. సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సైనిక దళాలు తమ మొబైళ్లలోని యాప్స్‌ తొలగించడం కానీ ఫోన్లను రీఫార్మాట్‌ చేయడం మంచిదని డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఐబీ జారీ చేసిన జాబితాలో 42 చైనీస్‌ యాప్స్‌ ఉన్నాయి. వాటిలో వీ చాట్‌, ట్రూ కాలర్‌, వీబో, యూసీ బ్రౌజర్‌, యూసీ న్యూస్‌ యాప్‌లు ఉన్నాయి. ఈ యాప్‌ల నుంచి భారత్‌కు భద్రత విషయంలో ముప్పు పొంచి ఉండటంతో, ఈ యాప్‌ల ద్వారా భారత్‌ భద్రతకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని చైనా హ్యాక్‌ చేసేందుకు యత్నిస్తోంది. దీంతో నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి.